హరీష్ రావుకు సవాల్ విసిరిన టీపీసీసీ అధ్యక్షులు..!

-

SLBC దగ్గరకు హరీష్ రావు బృదం వెళ్లి హడావిడి చేసి పత్రికలకు ఫోజు ఇవ్వడం కాదు.. కాళేశ్వరం నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా నైనా ఒక్క మీడియా ప్రతినిధినైనా అక్కడకి అనుమతి ఇచ్చారా.. కిలో మీటర్ల దూరంలో ఆపేసిన చరిత్ర మీది.. దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్. ఆ అలాగే మీరు ఏ సమన్వయం తో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో చెప్పాలి. అంత సమన్వయంతో నిర్మించిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయిందో హరీష్ రావు చెప్పగలడా ? దాని పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.

ఇక దేశం లో ఉన్న అనుభవం ఉన్న అన్ని రంగాల రెస్క్యూ టీమ్స్ ను పిలిపించి యుద్ధ ప్రాతిపదికన పని చేయిస్తుంటే ఏమి చేయాలో అర్ధం కాక చేష్టలు ఉడికి కోడు గుడ్డు పై ఈకలు పని హరీష్ రావు పెట్టుకున్నాడు..దానిలో భాగమే సమన్వయం లేదు అని హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ప్రతిది రాజకీయం చేయడం శవాల పై పేలాలు ఏరుకోవడం BRS పరిపాటి అయ్యింది. ప్రమాదం జరిగింది రిస్క్యూ టీమ్స్ రౌండ్ థి క్లాక్ కష్టపడుతున్నారు నిరంతరాయంగా మంత్రులు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మీడియా పారదర్శికంగా ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తుంది. అక్కడకు వెళ్లి హడావిడి చేసి వారి పనికి ఆటంకం కలిగించకూడదు అనే ఇంకితం కూడా లేకుండా పైగా ఆయన ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. మాజీ మంత్రులను MLA లను వెంట బెట్టుకొని మంది మార్బలం తో వెళ్లి హడావిడి చేయడంమే కాకుండా రోడ్డు పై బైఠా యించడం సిగ్గు చేటు అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news