ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాబడుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో… మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారం రోజుల కిందట నుంచి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.

దీంతో మార్చి మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని… ఉపాధ్యాయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల కోరిక మేరకు… కాకుండా మార్చి 15వ తేదీ నుంచి వడ్డీ పూట బడులు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం అందుతోంది.