టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో ఇరుకున్నారు. ఆయన్ను కలిసేందుకు వచ్చిన కొమరవోలు గ్రామస్తులతో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు అని అందరికీ తెలిసిందే.
మీ అమ్మ గారి ఊరు కొమరవోలును కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మమ్మల్ని పట్టించుకోండని గ్రామస్తులు కోరగా..కొమరవోలు గ్రామమా అదెక్కడా? ఆ గ్రామానికి ఈ జన్మలో రాను. మిమ్మల్ని పట్టించుకోడానికి పని లేదా మాకు.. ఫోటోలు దిగారుగా వెళ్ళండి ఇంకా అంటూ కొమరవోలు గ్రామస్తులపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ బాలకృష్ణ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అహంకారపు మాటలు
బాలకృష్ణను కలిసిన కొమరవోలు గ్రామస్తులు
బాలకృష్ణ తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు
మీ అమ్మ గారి ఊరు కొమరవోలును కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మమ్మల్ని పట్టించుకోండని కోరిన గ్రామస్తులు
కొమరవోలు గ్రామమా అదెక్కడా? ఆ గ్రామానికి ఈ జన్మలో రాను… pic.twitter.com/r73uZ6wcin
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2025