పుదీనా’ మనం ఎక్కువగా ఆహారం రుచిని పెంచడానికి లేదా సువాసనను పెంచడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీనిని స్పియర్ మింట్ అని అంటూ ఉంటారు. అయితే ఇది రుచికి మాత్రమే పరిమితం కాదు అనేది కొందరి మాట. దాని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. అజీర్తి లక్షణాలైన వికారం, వాంతులు, గ్యాస్ మొదలైన వాటికి విరుగుడుగా పని చేస్తుందని అంటున్నారు.
పుదీనా రసం అజీర్తి నుంచి ఉపశమనం పూర్తి స్థాయిలో కలిగిస్తుందని అంటున్నారు. అదే విధంగా ప్రాణంతక క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా చేసే కీమోథెరపీ వల్ల వచ్చే వికారం, వాంతులను తగ్గించేందుకు ఇది ఎంతో సహకరిస్తుందని అంటున్నారు. పుదీనాలో ఉండే ఫ్లేవోన్స్, ఫ్లావనోన్స్ అనే పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తాయట. ఇవి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయట.
మధుమేహం, రక్తపోటు, వివిధ రకాల గుండెజబ్బుల నుండి బయటపడే అవకాశం ఉంటుందట. హార్మోను అసమతుల్యత ఉన్న మహిళలు పుదీనా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అంతే కాకుండా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ జ్ఞాపకశక్తి పెరగడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. పుదీనా ఆకులు నమలడం వల్ల నోట్లోని చెడు బాక్టీరియా నశించి నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు