హై అలెర్ట్; ఒక్క రోజే వెయ్యి మందికి సోకిన కరోనా…!

-

చైనాలో పుట్టిన ఘోరమైన కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుంది. మరణాల సంఖ్య 82 కి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ వైరస్ ఎక్కువగా వుహాన్ మరియు ఇతర చైనా నగరాల్లో 2,700 మందికి సోకినట్టు అధికారులు గుర్తించారు. మరణించిన వారిలో ఎక్కువగా 50 ఏళ్ళ పైగా వయసున ఉన్న వారే కావడం గమనార్హ౦. గాలితో పాటే వెళ్తున్న ఈ వైరస్ ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తుంది.

ఇదిలావుండగా, వైరస్ వ్యాప్తి దృష్ట్యా వుహాన్ నగరం మరియు హుబే ప్రావిన్స్ నుండి 250 మంది భారతీయులను తరలించే అంశంపై భారత మరియు చైనా ఉన్నతాధికారులు సోమవారం చర్చించారు. చైనా నుండి భారతీయులను తరలించడానికి గానూ భారత దౌత్యవేత్తలు సోమవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.

కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా, చైనా నుంచి తిరిగి వచ్చే మొత్తం 3,756 మంది విమాన ప్రయాణికులను గత తొమ్మిది రోజులగా వైద్యులు ముంబై విమానాశ్రయంలో పరిక్షించగా వీరిలో ఐదుగురికి కరోనావైరస్ (దగ్గు మరియు జ్వరం) లక్షణాలు ఉన్నట్లు తేలింది, అయితే ముంబైలో ఇప్పటివరకు ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధారించబడలేదు. ఇప్పటికే దేశంలో పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news