ప్రపంచ గుర్తింపు పొందిన యునెస్కో ఆలయం రామప్ప, దాని అనుబంధ టెంపుల్స్ ప్రస్తుతం ప్రమాదపు అంచున ఉన్నాయి.ప్రభుత్వం ఆలయాల సంరక్షణ కోసం చర్యలు తీసుకోకపోవడం వల్లే కొందరు అక్రమార్కులు ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు ఇటీవల పలు ఫిర్యాదులు సైతం వచ్చాయి. ఈ క్రమంలోనే వెంకటాపురం మండలంలోని రామప్ప ఆలయం ఈస్ట్ రోడ్డు, గొల్లాల టెంపుల్‌ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సందర్శించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..రామప్ప దేవాలయం ఈస్ట్ రోడ్డు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, ఏరియా మ్యాపింగ్ సర్వే చేసి, బౌండ్రి పిల్లర్ ఫిక్స్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కెనాల్ ఏరియాను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. గొల్లాల గుడిని సందర్శించి గుడి పైకప్పు, దెబ్బతిన్న శిఖరాన్ని పరిశీలించారు. ఆలయ పూర్తి వివరాలను పురావస్తు శాఖ కలెక్టర్‌కు అందించింది. ధ్వంసమైన శిల్పం,పువ్వుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు చేయాలని, రాత్రిళ్లు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించారు.