పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో వరంగల్ కి ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ కి ఎయిర్ పోర్టు కావాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని నేనే అడిగా.. భూసేకరణను క్లియర్ చేసి ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు కావాలని ఢిల్లీలో నివేదికలు అందించాకే కదలిక వచ్చింది. ఢిల్లీకి ఇందుకే వెల్తున్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేనే సాధించా. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉప కులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా..? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా..? అని ప్రశ్నించారు.