వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేసిందే బీఆర్ఎస్.. పోస్టు వైరల్

-

వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు క్రెడిట్ కోసం ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం మామునూర్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది.

వరంగల్‌లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని ఎన్నో సార్లు కేంద్ర మంత్రులను కలిసి, దాని నిర్మాణానికి ఇంకా అధనంగా భూమి కావాలని అడిగితే.. గత ప్రభుత్వం కేబినెట్ అప్రూవల్‌తో 253 ఎకరాల భూమిని కూడా ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు, పార్టీ పోస్టులు పెడుతోంది. ఇంత త్వరితగతిన ఎయిర్ పోర్టు మంజూరు కావడానికి విశేషంగా కృషి చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ పార్టీ శ్రేణులు పోస్టులు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ తీసుకున్న చొరవ,దానికి సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నారు.

https://twitter.com/gumpumestri/status/1895718270231314482

Read more RELATED
Recommended to you

Latest news