ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు భూ కబ్జాలకు పాల్పడినట్లు డిప్యూటీ సీఎం భట్టి అనుచరుడు ఆరోపించారు. ఖమ్మం పట్టణంలోని 57వ డివిజన్ రమణ గుట్ట ప్రాంతంలోని 64వ సర్వే నెంబర్ 840 గజాల స్థలాన్ని కబ్జా చేసి స్థానిక కార్పొరేటర్ భర్త ముస్తఫా ఇండ్లు కడుతున్నట్లు వెల్లడించారు.
ఈ భూమిని 2018లో కమ్యూనిటీ హాల్,బడి నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండతో ప్రస్తుత స్థానిక కార్పొరేటర్ భర్త ముస్తఫా ఆ స్థలాన్ని ప్లాట్స్‌గా డివైడ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నట్లు భట్టి విక్రమార్క అనుచరుడు,స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆ నిర్మాణాలను స్థానికులు అడ్డగించినట్లు తెలిసింది.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మంత్రి తుమ్మల అనుచరుడు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించిన డిప్యూటీ సీఎం భట్టి అనుచరుడు
ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ లోని రమణ గుట్ట ప్రాంతంలో 64వ సర్వే నెంబర్లో 840 గజాల స్థలాన్ని కబ్జా చేసి ఇండ్లు కడుతున్న స్థానిక… pic.twitter.com/2dRokBvAJX
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025