చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. జీడీ నెల్లూరులో సీఎం స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు. దీనిలో భాగంగా ఓ మహిళకు పింఛన్ అందించిన సీఎం.. ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరూ ఆడపిల్లలకు రూ.2లక్షల చొప్పున ఎఫ్ డీ చేయాలని, వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు.
సదరు మహిళా కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు సీఎం చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు గంగాధర నెల్లూరుకు చేరుకోగానే అక్కడ ఆయనతో ఫొటోలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయినప్పటికీ చాలా మందితో చంద్రబాబు సెల్ఫీ ఫొటోలు దిగారు.