నీ చెడు గురించి చెవిలో చెప్తే చెవుల నుండి రక్తం వస్తది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

రేవంత్ రెడ్డి చేసిన మంచి మైక్ లో చెప్పడానికి నువ్వు చేసింది ఏం లేదు.. నీ చెడు గురించి చెవిలో చెప్తే చెవుల నుండి రక్తం వస్తది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు మన ఇంటి పార్టీ, మన పార్టీ బీఆర్ఎస్ ని గెలిపించాలని సూచించారు.

రేవంత్ రెడ్డి చేసిన అప్పులతో ఏమి అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. పార్టీ మారిన వారికి ఉప ఎన్నికల్లో తగిన బుద్ది చెబుదామన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని తిట్టనివాళ్లు లేరు అన్నారు. రుణమాఫీ పేరుతో అన్నధాతలను నిలువుగా ముంచాడు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశాడని తెలిపారు. కేసీఆర్ సమయంలో నాట్లేసే సమయంలో రైతు బంధు వచ్చేది. కానీ కాంగ్రెస్ హయాంలో పంట కోసిన తరువాత కూడా ఇంకా రాలేదన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news