RSA Vs ENG : కష్టాల్లో ఇంగ్లండ్.. సౌతాఫ్రికా సెమీస్ కి వెళ్లే ఛాన్స్..!

-

ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇవాళ ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య కీలక ఇన్నింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కి తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. సాల్ట్ తొలి ఓవర్ లోనే ఔట్ అయ్యాడు. ఆ తరువాత డకెట్ 24 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్ మెన్  జెమీ స్మిత్ డకౌట్ అయ్యాడు. హార్రీ బ్రూక్ 19 పరుగులు చేసి పెవిలీయన్ కి చేరాడు.

క్రీజులో మంచి ఫామ్ లో ఉన్న జో రూట్ 37 పరుగులు చేసి మడర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జోరూట్ ఔట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ కూడా వెనుదిరిగిపోయాడు. దీంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడిందనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోయినట్టయితే ఇంటికే.. గెలిచినప్పటికీ ఇంటికే కానీ.. భారీ తేడాతో గెలిస్తే.. అప్గానిస్తాన్ సెమీస్ కి వెళ్లే ఛాన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు 114 పరుగులు చేసి 6 వికెట్లను కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో గ్రూపు-బీ లో టాప్ గా నిలుస్తుంది సౌతాఫ్రికా.

Read more RELATED
Recommended to you

Latest news