సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

-

తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సహనం, అవగాహన లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నానని.. ఇప్పటికే ఎన్నో నిధులు తీసుకొచ్చానని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన.. రేవంత్, కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత తగ్గదని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన తొలిరోజు నుంచే ప్రజలు రేవంత్ మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకారంతో తెలంగాణలో రూ.10 లక్షల కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నానన్నది అవాస్తవమని అన్నారు. నన్ను తిట్టిన వాళ్లను కూడా ఎప్పుడూ బెదిరించలేదని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news