పల్నాడులో పెన్షన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరార్

-

ఏపీలో మరో వింత ఘటన చోటుచేసుకుంది. పల్నాడులో పెన్షన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పారిపోయినట్లు సమాచారం. దాచేపల్లి మున్సిపాలిటీలోని సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రసాద్.. రూ.8.43 లక్షల పెన్షన్ డబ్బులతో పరారయ్యాడు.

 

తమకు ఇంకా పెన్షన్ రాలేదని పెన్షన్ దారులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలియడంతో పెన్షన్లు పంపిణీ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పెన్షన్ దారులు తమ ఆందోళన విరమించినట్లు సమాచారం. కాగా, పెన్షన్ డబ్బులతో పారిపోయిన సచివాలయ ఉద్యోగి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news