IND Vs NZ : ముగ్గురు భారత కీలక ఆటగాళ్లు ఔట్..!

-

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ గ్రూప్ స్టేజీలో చివరి మ్యాచ్ ఇవాళ దుబాయ్ వేదికగా భారత్ -న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభం అయింది. టాస్ గెలిచిన కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్ లో 300వ వన్డే మ్యాచ్ కావడం విశేషం అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ కి చేరాడు.

భారత్ కు స్వల్ప వ్యవధిలోనే భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. తొలుత ఓపెనర్ శుభ్ మన్ గిల్ 2 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులు చేసి తన ఇష్టమైన షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. బెమిసన్ బౌలింగ్ లో షాట్ కి ప్రయత్నించిన రోహిత్ విల్ యంగ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలీయన్ కు చేరాడు. మరోవైపు విరాట్ కోహ్లీ వేగంగా ఆడే క్రమంలో బ్యాక్ వర్డ్ పాయింట్ లో గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో విరాట్ కోహ్లీ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. దీంతో 30 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయింది భారత్.

Read more RELATED
Recommended to you

Latest news