బీఆర్ఎస్ నాయకుడికి గులాబీ బాస్, తెలంగాణ మొట్ట మొదటి సీఎం కేసీఆర్ సాయం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకుడికి రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం చేశారు కేసీఆర్. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఖమ్మం టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు.

ఇక ఈ విషయం తెలుసుకొని తన నివాసానికి పిలుచుకొని, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షల చెక్కును స్వయంగా అందజేశారు కేసీఆర్. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకుడికి కేసీఆర్ రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం చేసిన విషయం వైరల్ గా మారింది.