ఏపీలోని కాకినాడలో భారీ పేలుడు సంభవించింది. బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో బాణసంచా పార్సిల్ దింపుతుండగా పేలుడు చోటుచేసుకున్నట్లు సమాచారం. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో హమాలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా.. వెంటనే వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
పార్సిల్‌ను ఎత్తుకున్న హమాలీ దానిని కింద పడేయగా పెద్దఎత్తున బ్లాస్ట్ సంభవించి మంటలు చెలరేగిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.