తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావిడి నెలకొంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక నేటి నుంచి ఈనెల 10 వతేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది.

తెలంగాణ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈ ఐదుగురి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం శాసనసభలో పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు, BRS ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అయితే… బీఆర్ఎస్ MLC అభ్యర్థిగా మహమూద్ అలీ కు ఛాన్స్ ఇవ్వనున్నారట కేసీఆర్.