ప్రతి ఒక్కరు జీవితంలో కోరుకునేది ఆర్థిక భద్రత మాత్రమే. చాలా శాతం మంది ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కాకపోతే ఎన్నో కారణాల వలన ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు. అలా కాకుండా సరైన విధంగా పొదుపు చేయడం ప్రారంభిస్తే జీవితాంతం ఎంతో సుఖంగా ఉండవచ్చు. ఈ విధంగా పొదుపుని చేసేందుకు మరియు దాని ద్వారా పెన్షన్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక సేవింగ్స్ పథకం మాత్రమే కాకుండా పెన్షన్ కూడా అందిస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేక గార్డియన్ లు పిల్లల కోసం పెన్షన్ ఖాతాను తెరిచి ఆ ఖాతాలో ధనాన్ని పొదుపు చేయవచ్చు.
అర్హత వివరాలు:
ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో భాగంగా పొదుపు చేయాలనుకునేవారు మైనర్ ల తల్లిదండ్రులు లేక గార్డియన్ అయి ఉండాలి. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు పెన్షన్ ఖాతాలో డిపాజిట్లను చేయవచ్చు. 18 ఏళ్లు తర్వాత ఆ ఖాతా ఎన్పీఎస్ అకౌంటు గా మారుతుంది. దీంతో ఆర్థిక భద్రత పెరుగుతుంది మరియు పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఈ విధంగా రిటైర్మెంట్ అయ్యేసరికి పెన్షన్ ను పొందవచ్చు.
దరఖాస్తు చేసే విధానం:
ఎన్పీఎస్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈఎన్పీఎస్ వెబ్ సైట్ కు వెళ్లాలి. దానిలో ఎన్పీఎస్ వాత్సల్య మైనర్స్ మెనూ క్లిక్ చేసి రిజిస్టర్ చేయాలి. ఈ ప్రక్రియలో భాగంగా మొబైల్ నెంబర్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడి వంటి మొదలైన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ విధంగా అడిగిన వివరాలను నింపిన తరువాత అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 1000 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా 18 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు ఖాతాలో డబ్బులను డిపాజిట్ చేయవచ్చు మరియు ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు.