వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు !

-

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. బ్రహ్మలింగయ్య చెరువు అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలు చేపట్టినట్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఫిర్యాదు అందిందని అంటున్నారు. ఈ తరుణంలోనే.. వంశీ, అనుచరులు లక్ష్మణ రావు, రంగా, శేషు, రవి, పరంధామయ్యపై కేసులు నమోదు అయ్యాయి.

AP Police registered another case against Vallabhaneni Vamsi

ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు లో ఉన్నారు. ఆయన రిమాండ్‌ ను మళ్లీ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయనకు బెయిల్‌ వచ్చినా…మరో కేసులో అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉందట. దీంతో… జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉక్కిరి భిక్కిరి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news