కులంపేరుతో దూషించాడని.. వ్యాటర్ ట్యాంక్ ఎక్కి పడిపోయిన వ్యక్తి

-

కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపే క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని పట్టణంలో నివసిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఎవరో కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని, సదరు వ్యక్తిని శిక్షించాలని ఆ వ్యక్తి గాంధీనగర్‌లోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపే క్రమంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఆ టైంలో చంద్రశేఖర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. గాయాలపాలైన అతన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news