తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో అధికారంలోకి వచ్చిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కొందరూ బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. కులగణన పై అభ్యంతరాలు ఉంటే శాసనమండలిలో మాట్లాడవచ్చని సూచించారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీన్మార్ మల్లన్న ఇవాళ మీడియాతో మాట్లాడి కులగణన సర్వే పై విమర్శలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని తెలిపారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని.. రాహుల్ గాంధీ తలెత్తుకుని తిరగాలని ఆశించాను. కానీ నూటికి నూరు శాతం పారదర్శకంగా సర్వే చేస్తేనే ఆదర్శంగా ఉంటుంది. అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి బీసీ వర్గాలను అణచిపెట్టే ప్రయత్నం చేసారు. నేను మాట్లాడింది తప్పు అయితే మళ్లీ కులగణనను ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న.