వరంగల్ జిల్లా రాయపర్తి బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళన నిర్వహించారు. గతేడాది నవంబర్ 19న రాయపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. దొంగలు రాత్రి పూట బ్యాంకులో చొరబడి సుమారు 19 కిలోల బంగారాన్ని మాయం చేశారు.
అంతరాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2 కిలోల 520 గ్రాము బంగారాన్ని రికవరీ చేశారు.ఈ క్రమంలో బ్యాంకు ఖాతాదారులు తమ బంగారాన్ని ఇప్పించాలని గురువారం ఉదయం ఎస్బీఐ బ్యాంకును ముట్టడించారు. సిబ్బంది, అధికారులతో వాగ్వాదానికి దిగారు.
https://twitter.com/ChotaNewsApp/status/1897491136740254047