ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేశ్ ఆసక్తికర ట్వీట్..!

-

దేశంలోనే తొలిసారిగా ‘మన మిత్ర’  పేరుతో కూటమి ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్  విధానాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సేవల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. తొలి దశలో వాట్సప్ ద్వారా 161 పౌరసేవలను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ప్రజా వినతులు స్వీకరించడంతో పాటు వారికి అవసరమైన సమాచారాన్ని కూడా 9552300009 ద్వారా అందిస్తోంది.

దేవాదాయ, ఇందనం, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో వాట్సప్ ద్వారా సేవలు కొనసాగిస్తోంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్ ఇలా వివిధ శాఖలకు సంబంధించిన చాలా సర్టిఫికెట్లను కూడా వాట్సప్ ద్వారా అందిస్తోంది. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, సర్వీసు రిఫండ్, ఫీడ్ బ్యాక్ తదితర సేవలను కూడా కొనసాగిస్తోంది. అలాగే వాట్సప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ పంపుతోంది. అందులో పేరు, ఫోన్ నెంబర్,
చిరునామా తదితరలు పొందుపరిచి, వారి వినతిని టైప్ చేస్తే ఒక రిఫరెన్స్ నంబర్ వస్తోంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది..?. ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు
తెలుసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది

Read more RELATED
Recommended to you

Latest news