ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5 శాతం డిఏ ప్రకటించారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. డిఎ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీ పై 3.6 కోట్లు అదనపు భారం పడనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మది నుండి వచ్చిన ఆలోచన రేపు మహిళా దినోత్సవం నుండి అమలులోకి మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతి గా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం ఉండనుంది.. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. తరువాత దశలో 450 బస్సులు మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక దీన్ని రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.