బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత డా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. దీంతో… ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు దాసోజు శ్రవణ్. దాదాపు 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో అనుబంధం కలిగిన వ్యక్తి పార్టీ సీనియర్ నేత డా దాసోజు శ్రవణ్.

ఉద్యమ కారుడు అయిన నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత డా దాసోజు శ్రవణ్ కు అవకాశం ఇచ్చారు కేసీఆర్. అటు గతంలో గవర్నర్ కోటాలోనే పార్టీ సీనియర్ నేత డా దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కావాల్సింది. కానీ… గత గవర్నర్ తమిళి సై కారణంగా… దాసోజు శ్రవణ్ కు అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు దాసోజు శ్రవణ్ కు అవకాశం రావడం జరిగింది.