ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్న కేసీఆర్

-

ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారట కేసీఆర్. ఈ విషయాన్ని మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ ప్రకటించారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు, తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని తెలిపారు కేటీఆర్‌. కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దు అనేది ఒక కొడుకుగా నా అభిప్రాయం అంటూ వ్యాఖ్యానించారు.

KCR to attend assembly sessions from now on

కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరిపోరన్నారు. వేం నరేందర్ రెడ్డికి పదవి ఇప్పించు కోలేక పోయాడు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో వినట్లేదన్నారు. ఆయన అనుచరులకు పదవులు ఇప్పించు కోలేక పోతున్నారని చురకలు అంటించారు. ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల ను చూస్తే అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. సొంత అనుచరుడు వేం నరేందర్ రెడ్డి కి కూడా పదవి ఇప్పించు కోలేక పోయాడని సెటైర్లు పేల్చారు. 39 సార్లు ఢిల్లీ కి పోయినా మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేక పోతున్నాడని మండిపడ్డారు కేటీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news