రుషికొండ బీచ్ లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత ప్రభుత్వ దుర్మార్గపు విధానాల అవశేషాలతో పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్.. కేంద్ర ప్రభుత్వం నుండి సడలింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
బీచ్ లో ఆక్రమణలు తొలగించడం, పరిశుభ్రత పాటించడం, ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ ను పెంపొందించడం వంటి అంశాలపై దృష్టిసారించాం. నెల్లూరు సమీపంలోని కోడూరు బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. యూరోపియన్ లు బీచ్, వెల్ నెస్ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారు. రాష్ట్రంలో 50,000 గదులను అందుబాటులోకి తీసుకువస్తాం. సముద్ర ఆధారిత పర్యాటకం అభివృద్ధి చేస్తాం. సముద్ర ఆధారిత పర్యాటకం అభివృద్ధికి బృహత్తర ప్రణాళికను రూపొందిస్తున్నాం. బీచ్ లు, క్రూజింగ్ బోటింగ్, ఫిషింగ్, సర్ఫింగ్, పాడిల్ బోర్డింగ్, వాటర్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేస్తాం అని కందుల దుర్గేష్ పేర్కొన్నారు.