నాకు ఇష్టమైన క్లిప్స్.. పాడి కౌశిక్ రెడ్డి ట్వీట్ వైరల్

-

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘తెలంగాణ అసెంబ్లీలో నా బెస్ట్ క్లిప్స్’ అంటూ పాడి కౌశిక్ రెడ్డి రాసుకొచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న రీల్స్ వీడియోను ఆయన షేర్ చేశారు.

అసెంబ్లీ నుంచి నాకు ఇష్టమైన క్లిప్‌లలో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. కమాన్ బీఆర్ఎస్ఎల్‌పీ.. తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీలో పోరాటానికి సిద్ధం అవుదామని ట్వీట్ చేశారు. ఈ వీడియో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా, తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సెషన్స్ నుంచి అటెండ్ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news