హోలీ పండుగను అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు హోలీ వేడుకలలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ సంవత్సరం మార్చి 14వ తేదీన హోలీ పండుగ వచ్చింది. దీనికి ముందుగానే హోలికా దహనం కూడా జరుగుతుంది. హోలికా దహనం అనేది ఫాల్గుణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఆ రోజున కుల దేవతలను పూజించడంతో పాటు మిఠాయిలను కూడా సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ రోజున కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది. హోలికా దహనం రోజున భద్రకాలం కేవలం ఒక గంట మాత్రమే దక్కుతుంది.
ఈ సంవత్సరం భద్రకాలం అనేది రాత్రి 10:44 వరకు ఉంది. హోలికా దహనం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఘనంగా పూజలను చేస్తారు మరియు ఇటువంటి కార్యక్రమాలను చేయడం వలన నెగెటివిటీ కూడా తొలగిపోతుందని నమ్ముతారు. హోలికా దహనం నాడు ఉదయాన్నే నిద్ర లేచి ఆవాల నూనె లేక నువ్వుల నూనెను ఉపయోగించి ఒంటికి రాసుకుని తల స్నానాన్ని చేయాలి మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే హోలికా దహనం రోజున చల్లారిన బస్మాన్ని ఎరుపు రంగు బట్టకు కట్టి బీరువాలో పెట్టాలి. దీని తర్వాత ఇంట్లో సంప్రదాయాలు ప్రకారం లక్ష్మీదేవికి పూజలు చేయాలి.
ఈ విధంగా హోలికా దహనం రోజున పూజలను చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పక పొందవచ్చు. ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులను కూడా తగ్గించుకోవచ్చు. అయితే హోలికా దహనం సమయంలో కొబ్బరికాయను సమర్పించవచ్చు మరియు నెయ్యిలో ముంచిన తమలపాకు పై బెల్లం ముక్కను ముంచి దహనంలో వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు. కనుక హోలికా దహనం రోజున వీటిని తప్పక పాటించండి, లక్ష్మీదేవి ఆశీస్సులను పొందండి.