మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ !

-

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్ట్ లు ఆగడం లేదు. తాజాగా మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ అయ్యారు. జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారట పోలీసులు.

Female journalist Revathi arrested

రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్ సీజ్ చేశారు పోలీసులు. రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేశారట పోలీసులు. అయితే… దీనిపై మహిళా జర్నలిస్ట్ రేవతి ఓ వీడియో కూడా రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news