తెలంగాణ బడ్జెట్ మీద మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తక్కువగా కేటాయింపులు చేశారని విమర్శించారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ..
‘వ్యవసాయానికి కేసీఆర్ హయాంలో 4.5 లక్షల కోట్లు ఖర్చు చేశాం.పదేళ్లలో రైతుల కోసం దాదాపు రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టపెట్టడం వల్ల వరి ఉత్పత్తిలో తెలంగాణ నం.1 అయింది. ఇప్పుడు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఓదార్చడానికి ఒక్క మంత్రి దిక్కు లేడు. మా హయాంలో రైతుబంధు రూపంలో రూ.73వేల కోట్లు, రుణమాఫీ రూపంలో రూ.28 వేల కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు,ఉచిత విద్యుత్ ఇలా మొత్తం రూ.4.5 లక్షల కోట్లు ఇవ్వడం వల్ల వరి ఉత్పత్తిలో తెలంగాణ నం.1 అయింది’ అని వెల్లడించారు.