ఏపీ శాసనమండలిలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో చైర్మన్ పోడియం చుట్టూ 23 మంది మార్షల్స్ రంగంలోకి దిగారు. మార్షల్స్ రక్షణలో సభ కొనసాగుతోంది. మార్షల్స్ ఏర్పాటుపై వైసీపీపక్ష నేత బొత్స అభ్యంతరం తెలిపారు. ఏపీ శాసనమండలిలో మార్షల్స్ రావడం దుష్ట సంస్కృతి అంటూ ఆగ్రహించారు బొత్స సత్యనారాయణ

పెద్దల సభలో ఇలా చేయడం సబబు కాదని చైర్మన్ ఆగ్రహించారు. మీ సీట్ల దగ్గరే నిరసన తెలుపుకోవాలని కోరారు చైర్మన్. దీంతో మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం బొత్స మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసన మండలి లో వాకౌట్ చేసిందని తెలిపారు. మెగా డీఎస్సీ అన్నారు.. ఏమైంది? అంటూ నిలదీశారు. నెలకు రూ.3వేల చొప్పన నిరుద్యోగ భృతి ఏమైంది? అని ప్రశ్నించారు బొత్స. గత ప్రభుత్వం బకాయి పెట్టిందని తప్పించుకుంటున్నారని ఆగ్రహించారు బొత్స సత్యారాయణ.