అరబిందో కంపెనీ వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై ఏపీలో సీఐడీ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు విచారించినట్లు తెలిసింది. సుమారు 3 గంటల పాటు విచారణ జరగగా.. అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘నేను ఎప్పుడూ అరబిందో కంపెనీ వ్యాపారాల్లో జోక్యం చేసుకోలేదు.కేవీ రావుతో ఉన్న సంబంధం గురించి సీఐడీ అధికారులు ప్రశ్నించగా.. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను’ అని విజయసాయి రెడ్డి మీడియాకు బదులిచ్చారు.