త్రి భాష వాదన సరికాదు.. భారతదేశానికి బహుభాషలే కావాలని జనసేనాని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాది పై హిందీని రుద్దుతున్నారని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయవద్దన్నారు. మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కావాలా..? అని ప్రశ్నించారు. హింది మాత్రం వద్దా..? ఇదేం న్యాయమని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సభలో మాట్లాడారు.
దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. బహుభాషా విధానం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమ పై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని.. ఆయన ట్వీట్ చేశారు. “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి” ప్లీజ్ అంటూ ట్వీట్ లో కోరారు ప్రకాశ్ రాజ్.
"మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please… 🙏🏿🙏🏿🙏🏿 #justasking
— Prakash Raj (@prakashraaj) March 14, 2025