మద్యం మత్తులో బార్‌లో కొట్లాట.. పలువురికి గాయాలు

-

మద్యం మత్తులో కొందరు యువకులు హల్చల్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట భవానికుంట తండాకు చెందిన యువకులు మద్యం సేవించేందుకు ఓ బారుకు వెళ్లారు. మద్యం సేవించే క్రమంలో అక్కడ మరో వర్గంతో వారికి వాగ్వాదం జరిగింది.

మాటామాటా పెరిగడంతో అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో రెండు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్రంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news