కృష్ణా జలాల విషయంలో నేడు సభకు వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ మొహం చాటేశారని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కేసీఆర్ ఏ రోజైతే సభకు వస్తారో.. ఆ రోజు తాను కృష్ణా జలాలపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఆ చర్చలో తమ తప్పు ఏమైనా ఉందని నిరూపిస్తే.. నిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులకు తాను క్షమాపణ చెబుతానని అన్నారు. కృష్ణ నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2022లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రగతి భవన్ కి పిలిపించుకుని.. పచభక్ష పరమాన్నాలు పెట్టారని అన్నారు.
రాయలసీమలో ఇవాళ పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేష్ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రోజుకు 10 టీఎంసీ నీరు ఆంధ్రాకు అక్రమంగా వెళ్తేన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 60 రోజుల్లో 600 టీఎంసీల కృష్ణా జలాలు పోతే.. మనకు ఏం మిగుతాయని అన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57.84 లక్షల జీతం తీసుకున్నారని.. ఇప్పటి వరకు ఆయన కేవలం రెండు సార్లే అసెంబ్లీకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని
మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణశాసనం రాశారని సీఎం రేవంత్ ఫైర్
అయ్యారు.