బల్కంపేట హాస్పిటల్ కు రోశయ్య పేరు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు CM రేవంత్ రెడ్డి. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చర్లపల్లి టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కిషన్ రెడ్డి. బండి సంజయ్ కి లేఖ రాస్తానని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రోశయ్య విగ్రహం బల్కం పేట లో నేచర్ క్యూర్ ఆసుపత్రికి పేరుతో పాటు విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

అలాగే… ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి దామోదర రాజనర్సింహ. అనంతరం సభలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్య, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పిస్తూ బిల్లు తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ మరో బిల్లు తీసుకొచ్చింది.