రూ.6వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం : సీఎం రేవంత్ రెడ్డి

-

రూ.6వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం అద్భుతమైన పథకం అని తెలిపారు. దీనిని గ్రామాల్లో ఉండే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.  దేశంలో నిత్యవసర ధరలు తక్కువగా ఉన్నది తెలంగాణలోనే అని తెలిపారు.

ఇసుక పై గతంలో రోజుకు రూ.1.25 కోట్ల నుంచి 1.50 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం రోజుకు రూ.3కోట్ల నుంచి 3.50 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. దేశంలో అత్యధికంగా జీఎస్టీ చెల్లించేది తెలంగాణనే అని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చామని తెలిపారు. అధికారులకు చెబుతున్నా అర్హత ఉన్న వారికి ఉద్యోగం, ఉపాధి కల్పించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news