ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు శాస్త్రం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి వాస్తు శాస్త్రం గురించి సరైన అవగాహన లేకపోయినా ఇంట్లో పెద్దవారు చెప్పినటువంటి విషయాలను తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో చెప్పినా నియమాలను పాటించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు. ఇంట్లో వస్తువులను సరైన దిశలో పెట్టడం వలన ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇంటిని నిర్మించుకోవడానికి వాస్తు శాస్త్రాన్ని అందరూ ఉపయోగిస్తారు. పైగా వాస్తు నిపుణులు చెప్పినటువంటి విషయాలను కచ్చితంగా పాటిస్తారు.
అదేవిధంగా ఇంట్లో వస్తువులను కూడా సరైన దిశలో పెట్టడం వలన ఎంతో ఆనందంగా జీవించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఫ్రిడ్జ్ ను పడమర వైపున పెడతారో ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా జీవిస్తారు. ముఖ్యంగా ప్రశాంతంగా జీవించాలంటే తప్పకుండా ఇటువంటి నియమాలను పాటించాలి. ఈశాన్య దిశలో ఫ్రిడ్జ్ ను పెట్టడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్ ను నైరుతి దిశలో పెట్టవచ్చు కానీ ఉత్తరం తూర్పు దిశల్లో అస్సలు పెట్టకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్ ను సరైన దిశలో పెట్టకపోవడం వలన లక్ష్మీదేవి కటాక్షం లభించదు.
దీంతో ఎన్నో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సహజంగా ఫ్రిజ్ ను గోడకు దగ్గరలో పెడుతూ ఉంటారు, అలా అస్సలు పెట్టకూడదు మరియు తలుపుకు ఎదురుగా కూడా ఉంచకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. దీంతో కుటుంబంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో ఫ్రిడ్జ్ ను ఉంచాలి. ఎప్పుడైతే ఫ్రిజ్ లో కూరగాయలు, పండ్లతో పాటుగా నీరు, పాలు వంటివి పెడతారో ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతో ఆర్థికంగా ఎంతో దృఢంగా ఉండవచ్చు పైగా కుటుంబ సభ్యులు మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు.