ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనం కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత ఢిల్లీకి వెళ్తారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి పైన చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా అమరావతి పునః ప్రారంభానికి ఈ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించబోతున్నారు.. అలాగే రాజధాని నిధులతో పాటు… పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.