సీఐడీ పోలీసుల కస్టడీకి పోసాని కృష్ణ మురళి చేరుకున్నారు.గుంటూరు కోర్టు ఒకరోజు కస్టడీకి ఇవ్వడంతో పోసానిని విచారించనున్నారు అధికారులు. విచారణకు ముందు గుంటూరు జీజీహెచ్ లో పోసానికి వైద్య పరీక్షలు, మెడికల్ టెస్ట్ లు నిర్వహించారు. అనంతరం గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి తరలించారు.
పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారు. దీని పై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను పీటీ వారెంట్ పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకువచ్చారు. గత బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.