బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రస్తుతం తన నియోజకవర్గ పరిధిలో ఎండుతున్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన రైతులతో ముచ్చటించి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెండ్ చేసినా..నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. నన్ను సస్పెండ్ చేసిన పర్వాలేదు.. ఎస్సారెస్పీ రైతులకు నీళ్లు ఇవ్వండి. రైతుల బాధలు పట్టని మూర్కపు ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజాలు మాట్లాడే వారిని బట్టలూడదీసి కొడతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’అన్నారు. కాగా, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దుబ్బతండా, మెగ్యమేతండా, ధర్మాపురం గ్రామాల్లో ఎస్సారెస్పీ కింద ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించారు.