కసాయి నేతలను నమ్మకండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై బిల్లును ప్రవేశపెట్టినందుకు బీసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీ కులగణన చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అని.. ఎన్నో రిస్క్ లు చేసి కులగణన చేసినట్టు తెలిపారు. 10లక్షల మందితో రాహుల్ కి కృతజ్ఞత సభ పెట్టండి అని.. సర్వేలో పాల్గొనని వారిని కలిసే కసాయి వాళ్లను నమ్మకండి అని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఈనెల 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో సభ ఉంటుందని.. అందుకు మా పీసీసీ ప్రత్యేకంగా రైలు ని బుక్ చేస్తుందని వెల్లడించారు. మన దగ్గర సభ పెడితే రాహుల్ గాంధీకి గౌరవం దక్కుతుందన్నారు. మన రాష్ట్రం మాదిరిగా దేశ వ్యాప్తంగా కులగణన సర్వే చేపడుతారని తెలిపారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. చట్టబద్దత లేని లెక్కలతో రిజర్వేషన్ పెంచలేమని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే బీసీలు ఎంత మంది ఉన్నారో తేల్చే పని మనం చేశామని వెల్లడించారు. బీసీల సహకారంతో ప్రబుత్వం వచ్చింది.. మీ సహకారం మేము ఏడాదిలోనే అమలు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news