KTR: ట్రిలియన్ డాలర్లలో ఎన్ని సున్నాలుంటాయో కూడా కాంగ్రెస్ వాళ్లకు తెలియదు !

-

ట్రిలియన్ డాలర్లలో ఎన్ని సున్నాలుంటాయో కూడా కాంగ్రెస్ వాళ్లకు తెలియదంటూ చురకలు అంటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేయడం కాదు.

BRS Working President and MLA KTR on the budget presented by the Congress government today

వీళ్ళు ట్రిలియన్ డాలర్ల అప్పు చేసే పరిస్థితి ఉందని తెలిపారు. దేశానికే సిగ్గుచేటు పాలన.. 20% కమీషన్ పాలన కాంగ్రెస్ పార్టీదని వివరించారు. అలాగే మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 గురించి అసలు ప్రస్తావనే లేదు. రేవంత్ రెడ్డి చేతగాని తనానికి నిలువుటద్దం అని బడ్జెట్ చెబుతుందన్నారు. ఏడాది కాలంలో లక్షా 60వేల కోట్లు అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి రూ.40వేల కోట్ల అప్పులు చేస్తేనే అప్పులు చేశారని చెబుతున్నారు. ఇవి అప్పులు కాదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మహానగరం అద్వానంగా మారిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news