రేపు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం

-

హైదరాబాద్ లో మార్చి 20వ తేదీ మధ్యాహ్నం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. కొత్త ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి స్టాండింగ్ కమిటీలో 8 మంది ఎంఐఎం, 7గురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో  బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించడం లేదు.

ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మొత్తం 16 అంశాలపై చర్చించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనుంది స్టాండింగ్ కమిటీ. అల్వాల్ లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ NOC ఇవ్వనుంది. నల్లగండ్ల చెరువులోకి వచ్చే మురుగు నీటిని మళ్లించేందుకు రూ.3కోట్ల 35 లక్షలు కేటాయింపునకు కమిటీ ఆమోదం తెలపనుంది. మరికొన్ని అంశాలపై కూడా కమిటీ చర్చినున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news