మనువడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు నేడు ఉదయం తిరుమలకు వెళ్లి కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
‘తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పని చేయాలి.ఇతర మతస్థులు ఉంటే వారి మనోభావాలు దెబ్బతినకుండా ఇతర చోట్లకు మారుస్తాం.దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించాం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి వారి ఆస్తులను కాపాడటానికి కంకణం కట్టుకున్నాం.విదేశాల్లో కూడా స్వామి వారి ఆలయాలు ఉంటే బాగుండేది అని చాలా మంది కోరుకుంటున్నారు’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.