మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టును విరబూసుకోవడానికి కారణం ఇదే..!

-

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం అంతరిక్షంలో వ్యోమగాముల జీవితం గురించి ఎన్నో వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే వీడియోలలో సునీత విలియమ్స్ జుట్టు విరబూసుకొని కనిపిస్తోంది. అయితే అంతరిక్షంలో ఉన్నప్పుడు వ్యోమగాములు జుట్టును ఎందుకు వదులుకుంటారు అని చాలామంది సందేహ పడుతున్నారు. అయితే దానికి కారణం ఇదే. సహజంగా అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి అనేది అస్సలు ఉండదు. కానీ భూమి పై గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన భూమి పై ఉన్నప్పుడు జుట్టు కిందకు ఉంటుంది.

దీంతోపాటుగా చిక్కులు పడటం, జుట్టు రాలడం వంటివి సాధారణంగా జరుగుతాయి. కాకపోతే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వలన గాలిలో తేలికగా తేలిపోతుంది మరియు ఎటువంటి చిక్కులు కూడా పడవు. కనుక జుట్టుని ముడి వేయకపోయినా ఎలాంటి చిక్కులు లేకుండా దగ్గరగా ఉంటుంది. పైగా వెంట్రుకలు కూడా ముఖం పై పడకుండా ఉంటాయి. కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా జుట్టుని విరబూసుకొని ఉంచవచ్చు. పైగా జుట్టుని దువ్వుకపోయినా సరే చిక్కులు పడవు. కనుక నెలల తరబడి జుట్టును దువ్వకపోయిన సరే అలానే ఉంటుంది.

పైగా జుట్టుని ముడి వేయాలి అంటే తప్పకుండా హెల్మెట్ ను పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా చేయడం వలన ముడి హెల్మెట్ కు తగిలి ఇబ్బంది పడతారు. అందువలన జుట్టుని విరబూసుకొని మహిళా వ్యోమగాములు కనిపిస్తూ ఉంటారు మరియు ఇలా ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి అస్సలు ఉండదో జుట్టు కూడా ఎంతో తేలికగా ఎగురుతూ ఉంటుంది. ఈ విధంగా గాలిలో తేలుతూ ఉంటే మరింత ఉత్సాహంగా కూడా ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందువలన ముడి వేయకుండా జుట్టుని విరబూసుకొని ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news