మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ ఫాంటసీ మైథాలజికల్ చిత్రాన్ని ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘బుక్ మై షో’ ఆధ్వర్వంలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నప్ప నటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నప్ప మూవీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై నటుడు రఘుబాబు స్పందించారు.
కన్నప్ప చిత్రం గురించి ఎవరైనా ట్రోల్స్ చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారని రఘుబాబు అన్నారు. గుర్తుపెట్టుకోండి. 100 శాతం కచ్చితంగా చెబుతున్నా. ట్రోల్ చేస్తే ఇక ఫినిష్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం రఘుబాబు కామెంట్స్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు.