అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడిచాయి.

కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీరియస్ అయ్యారు.ఈ క్రమంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్నినిలదీశారు. రేవంత్ రెడ్డి.. కల్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ? అని ప్రశ్నించారు. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.